ఇంద్రవెల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను నాణ్యత పాటిస్తూ వెంటనే పూర్తిచేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం సాలెగూడ, రామాగూడా, కోలాంగూడ, ధర్మాజీపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం దశలవారీగా ఆర్థిక సాయం చేస్తుందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జైనూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ జైవంతరావు, జిల్లా ఆర్టీఏ మెంబర్ రాజేశ్వర్, ఎంపీడీవో రాంప్రసాద్, లీడర్లు ప్రభాకర్, ఇక్బాల్, చంద్రయ్య, భారత్, గ్రామస్తులు పాల్గొన్నారు.
